ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రతి రోజు ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఒక ప్రకటనలో సూచించారు
ఉదయం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని తెలిపారు.
రోజుకు తగినంత నీరు తాగుతూ, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తేలికపాటి దుస్తులు ఉపయోగించాలి.
పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి చల్లని ఆహార పదార్థాలు తీసుకోవాలి.
తలనొప్పి, నీరసం, వాంతులు, శరీరం ఎక్కువ వేడెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.