E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తమ్మడపల్లి జి గ్రామంలో ఖబరస్థాన్ శుభ్రత కార్యక్రమం
తమ్మడపల్లి జి గ్రామంలో ఖబరస్థాన్ శుభ్రత కార్యక్రమం
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 27 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలోని ఖబరస్థాన్ ప్రాంగణంలో పెరిగిపోయిన ముళ్ళచెట్లను తొలగిస్తూ ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముహమ్మద్ అజీమ్ తన సొంత ఖర్చులతో జెసిబి ఏర్పాటు చేసి పనులు చేయించారు.చాలా కాలంగా పెరిగిపోయిన ముళ్ళచెట్ల వల్ల సమాధుల వద్ద ఇబ్బందులు ఏర్పడుతుండగా, ఆయన ముందడుగు వేయడంతో గ్రామస్థులు అభినందనలు తె…

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 27
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలోని ఖబరస్థాన్ ప్రాంగణంలో పెరిగిపోయిన ముళ్ళచెట్లను తొలగిస్తూ ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముహమ్మద్ అజీమ్ తన సొంత ఖర్చులతో జెసిబి ఏర్పాటు చేసి పనులు చేయించారు.చాలా కాలంగా పెరిగిపోయిన ముళ్ళచెట్ల వల్ల సమాధుల వద్ద ఇబ్బందులు ఏర్పడుతుండగా, ఆయన ముందడుగు వేయడంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ స్థానిక అధ్యక్షుడు ముహమ్మద్ బషీర్,రఫీ, ఖాజామియా అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.