అవినీతి అధికారులకు అడ్డాగా తయారైన జనగామ జనగామ జిల్లా
Jangaonపర్యవేక్షణ అదుపుతప్పిన పాలన చేస్తున్న జిల్లా కలెక్టర్
బూడిది గోపి సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు….పోరాటాలు ఉద్యమాలు నిర్బంధాలు జైలు కేసులు ఎంతో మంది త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న జనగామ జిల్లాలో అవినీతి అధికారుల వల్ల బ్రష్టు పట్టిపోతున్నదని జిల్లా ఔన్నత్యం గౌరవం దిగజారి పోతుందని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి ఆందోళన వ్యక్తం చేశారు…
ఈరోజు సిపిఎం జనగామ పట్టణ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరగగా వారు పాల్గొని మాట్లాడుతూ జనగామ జిల్లాలో ఉన్నత స్థాయి అధికారుల అవినీతి ఈమధ్యకాలంలో ఒక్కొక్కటిగా బయటపడ్డాయని గతంలో ఐబి DE రవీందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రజిత వైద్య జిల్లా అధికారి DM &HO ప్రజలను వారి పనులకు అనేక కారణాలు సాకులు చూపి పైల్లను పెండింగ్లో పెట్టి లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ గురయ్యారు అయినా జనగామ జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు భయం లేకుండా ఉందన్నారు.నిన్నటి రోజున స్వయంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఆర్ అండ్ బి EE హుస్సేన్ ఏ టి ఓ రవీందర్ దేశం కోసం పనిచేసిన జవానును ఇబ్బంది పెట్టి 14 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయమే లంచ అవతార్లకు కేంద్రంగా మారిందని జిల్లా కలెక్టర్ గా ఉన్న రిజ్వాన్ భాష పరిపాలన తీరు ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. కలెక్టర్ ఉదాసీనంగా ఉన్నాడు కాబట్టే అధికారులు ఇస్టా రాజ్యంగా లంచాలకు ఎగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ల వారిగా పెండింగ్ ఫైళ్లను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టయితే లంచాలు తీసుకునే అధికారులు భయపడేవారని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాలో అవినీతి అక్రమాలు జరగకుండా ఉన్నత స్థాయి రాష్ట్ర అధికార చే అన్ని డిపార్ట్మెంట్లలో పెండింగ్ ఫైల్ అన్ని పరిశీలన చేసి అవినీతి అక్రమాలను అరికట్టాలని లేకుంటే లంచగొండి అధికారుల అవినీతికి వ్యతిరేకంగా బాధితులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు….
ఈకార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎండి హజార్ కళ్యాణం లింగం బొట్ల శ్రావణ్ పందిళ్ళ కళ్యాణి మంగ బీరయ్య గట్టయ్య గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు…..