క్రీడాస్ఫూర్తి కోసమే సీఎం కప్ పోటీలు
Jangaonక్రీడాకారులను అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్
విజేతలకు ట్రోఫీలను అందజేసిన మంత్రి
మహిళా క్రీడాకారులకు 15 వేల రూపాయల నగదు బహుమతిని అందజేసిన మంత్రి
ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం పది లక్షల రూపాయలు మంజూరు
జిల్లాలో 6 కోట్లతో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు మంజూరు
రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్నడు లేని విధంగా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చీఫ్ మినిస్టర్ కప్-2023 పేరుతో.. పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించిదని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన
జిల్లాస్థాయి సీఎం కప్ ముగింపు వేడుకల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…. యువతలో క్రీడా స్ఫూర్తి నింపి, క్రీడల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటుచేసి దేశంలోనే కాకుండా ప్రపంచంలో విద్యార్థులను పోటీ పడేలా తయారు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఓటమి నుంచి పాఠం నేర్చుకొని గెలుపుకు పునాది వేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. విద్యార్థులకు చదువులు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యమని, చదువుతో పాటు ఆటల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు గెలుపు ఓటముల మధ్య ఒత్తిడిని ఎదుర్కోవడంలో తగిన నైపుణ్యాన్ని అందిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా తరగతి గదులు ప్లే గ్రౌండ్ లను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. గౌరవ సీఎం కేసీఆర్ గారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 19 వేల గ్రామాలు, పట్టణాలలో క్రీడా ప్రాంగణాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్మించుకుంటున్నాము. ఇప్పటికే 15 వేల పై చిలుకు క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయడం జరిగింది. దీనివల్ల గ్రామీణ క్రీడా కారులను ప్రోత్సహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కప్ క్రీడా పోటీల పేరుతో గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1200 మంది క్రీడాకారులు పాల్గొనగా. 12విభాగాల్లో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో 225 మంది గెలుపొందారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ గణవిజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, స్థానిక శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక,ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.