గిరిజన సంక్షేమ శాఖ లో త్రీసభ్య కమిటీలో సభ్యులు గా ఉన్న అధికారుల తప్పుడు రిపోర్ట్స్ నమ్మొద్దు… SFI
Uncategorizedజిల్లా ఉపాధ్యక్షుడు యస్. భూపెందర్
ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపసంచాలకులు డిప్యూటీషన్లో ఉపాధ్యాయులకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారంటూ వాటిమీద విచారణ కోసం వేసిన శ్రీసభ్య కమిటీ ఇచ్చిన తప్పుడు రిపోర్టును నమ్మొద్దని అది కేవలం కల్పితం అని అందులో వాస్తవాలు తక్కువగా అవాస్తవాలు ఎక్కువగా ఉన్నాయని , కావాలని అక్రమ పద్ధతుల్లో ఉపాధ్యాయులు డిప్యూటేషన్లు పొంది అధికారికి వేల రూపాయలు చెల్లించారని తప్పుడు రిపోర్టులు ,వాట్సప్ ,మొబైల్ రికార్డులు అందులో చూపించి రిపోర్ట్ పొందుపరిచారని దీన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవద్దని SFI జిల్లా ఉపాధ్యక్షుడు యస్. భుపెందర్ కోరారు.
గిరిజన సంక్షేమ శాఖలో క్షేత్రస్థాయిలో ఉన్న విద్యార్థులకు విద్యాభివృద్ధిలో చదువు నేర్పడం కోసం వారి వారి స్థాయిలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్న డిప్యూటేషన్లని వేరే రకంగా చిత్రీకరించి కావాలని ఆ D. D కుర్చీని లాగేసుకోవడం కోసం త్రిషబ్యా కమిటీ లోని కొందరు సభ్యులు ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు.ఐటీడీఏ ఏపీవోగా మరియు గురుకులాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ గా, అనేక రకాల పనుల సంబంధించినటువంటి రెండు రకాల బాధ్యతలను కూడా చూస్తూ అదనంగా డి. డీ బాధ్యతలు కావాలని
కొందరు ప్రయత్నాలు చేస్తూ కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖను అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు, కాబట్టి తక్షణమే వాస్తవాలను వెలికితేసి ఆ రిపోర్టును తిరిగి వేరే సభ్యుల తో విచారణ చేయించాలని, తప్పుడు పద్ధతుల్లో రిపోర్టు తయారుచేసిన త్రిసభ్య కమిటీపై కూడా ఇంకొక కమిటీ వేయాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.త్రిసభ్య కమిటీలో తప్పుడు రిపోర్ట్ రాసినటువంటి అధికారులను సైతం బాధ్యతల నుంచి తొలగించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.ఎక్కడైనా ఉపాధ్యాయులు డబ్బులు ఇచ్చారని ఒప్పుకొని ఉంటే డబ్బులు ఇచ్చిన ఉపాధ్యాయుల మీద కూడా చర్యలు తీసుకోవాలని,ఆ విధంగా విచారణ జరిగించాలని వారు ఉన్నాత అధికారులకు డిమాండ్ చేశారు.ఇది కేవలం గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న డిడిని మరియు కొంతమంది సిబ్బందిని ఇబ్బంది పెట్టడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్యగా రిపోర్టుగా ఎస్ఎఫ్ఐ భావిస్తుందని ఆయన అన్నారు.
గిరిజన గురుకులాలకు సైతం పర్మినెంట్ ఆర్,సి,ఓ, ను నియమించాలని అలాగే పర్మినెంట్ డి,డి నీ అన్ని రకాల శాఖలకు పెర్మనెంట్ ఉద్యోగస్తులను నియమించాలని ఇన్చార్జిల పేరుతో డిప్యూటేషన్ చేసిన పేరుతో పరిపాలన కొనసాగించడం ఇబ్బందికరమని ఆయన అన్నారు