జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 2025
Hyderabad, Telanganaతెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తొమ్మిది రోజులపాటు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభ రితంగా కొనసాగాయి.జాతీయ క్రీడా దినోత్సవం ఒక రోజుకే పరిమితం కాకుండాతొమ్మిది రోజులపాటు ఈ క్రీడా ఉత్సవాలు నిర్వహించాలన్న స్పోర్ట్స్ అథారిటీ ఆలోచనకు క్రీడా సమాజము నుండి అనుహ్య స్పందన లభించింది.అన్ని వర్గాలను క్రీడల్లో భాగస్వామ్యం చేయాలన్న క్రీడా విధానం ఆలోచనను అమల్లోపెట్టే దిశగా ఈ తొమ్మిది రోజుల వేడుకలు కొనసాగాయి.పసివయసుల నుండి పండు ముదుసలి వరకు అన్ని వయసుల వారికి క్రీడా కార్యక్రమాలు అందుబాటులో తీసుకురావాలని స్పోర్ట్స్ అథారిటీ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి.ఆగస్టు 23, 24 వ తేదీలలోక్రీడా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా అన్ని స్టేడియాల ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందగచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరు నెలల పసిపాపల నుండి పది సంవత్సరాల పిల్లల వరకు నిర్వహించిన క్రీడా పోటీలు పలువురి ప్రశంసలు అందుకుంది.అదేవిధంగా ఆగస్టు 23 నాడు సెలబ్రేషన్స్ మేకర్స్ వారి సమన్వయంతో హైదరాబాద్ హైటెక్స్ వద్ద ఏర్పాటు చేసిన క్రీడా ప్రదర్శన మరియు వేద కాక క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఆగస్టు 24వ తేదీ ఆదివారం నాడు హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వారి సహకారంతో నిర్వహించిన మారథాన్ రన్ విజయవంతమైఅందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో ఆగస్టు 25వ తేదీ నాడు ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు లో క్రీడాకారులు కోచులు స్పోర్ట్స్ అథారిటీ లోని వివిధ విభాగాల సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అథారిటీ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలోమెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం పట్ల ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న వారే కాకుండా యావత్ క్రీడా సమాజం నుండి హర్షం వ్యక్తం అవుతుంది.ఆగస్టు 26వ తేదీ నాడు నగరంలోని అన్ని స్టేడియాల్లో సీనియర్ సిటిజన్స్ కు మరియు క్రీడాకారులకు మహిళలకు, పారా క్రీడాకారులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.ఆగస్టు 27వ తేదీ నాడు నగరంలోని అన్ని స్టేడియాల్లో వినాయక వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మంటపాల వద్ద వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మన సాంస్కృతి సాంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు క్రీడా కార్యక్రమాలను జోడించడం జరిగిందిఆగస్టు 28వ తేదీ నాడు ఫిజికల్ లిటరసీ డే లెట్స్ మూవ్ అనే నినాదంతో ఉద్యోగులకు ఆట పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిజిఓ టీఎన్జీవో సచివాలయ ఉద్యోగులు మరియు నాలుగో తరగతి సిబ్బందితోపాటు వివిధ శాఖల ఉద్యోగులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా అంశాలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి రంగవల్లుల కార్యక్రమంలో వివిధ క్రీడా నినాదాలతో వేసిన ముగ్గులు పలువురిని ఆకర్షించాయి.ఆగస్టు 29వ తేదీ స్వర్గీయ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా నగరంలో అన్ని స్టేడియాల్లో ధ్యాన్‌చంద్ గారి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అదేవిధంగా గచ్చిబౌలి హాకీ స్టేడియంలో స్వర్గీయ ధ్యాన్‌చంద్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా వివిధ క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.ఇటీవల క్రీడా ప్రతిభ ప్రదర్శించి తెలంగాణకు ఖ్యాతి తీసుకువచ్చిన 41 మంది క్రీడాకారులకు ఒక కోటి 29 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడమే కాకుండా వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.క్రీడాకారులను తీర్చిదిద్దుతూ దిద్దుతున్న కోచులకు ఆపన్న హస్తం అందించాలని లక్ష్యంతో గురువందనం పేరిట ఒక భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లో పనిచేస్తున్న కోచులను, అధికారులను సిబ్బందిని పలువురిని సత్కరించుకోవడం జరిగింది.క్రీడా కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాను కోచులను సిబ్బందిని సన్మానించుకోవాలన్న ఒక నూతన ఒరవడికి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందిమన గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలు మర్చిపోతున్న విస్మృత క్రీడలను ప్రోత్సహించి గ్రామీణ స్థాయి నుంచే క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆగస్టు 30వ తేదీ నాడు వివిధ సంప్రదాయ క్రీడ పోటీలు నిర్వహించడం జరిగిందిఆగస్టు 31వ తేదీ నాడు నిర్వహించిన ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్అనే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ వర్మ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తొమ్మిది రోజులపాటు తెలంగాణ స్పోర్ట్స్ పార్టీ నిర్వహించిన వివిధ వినూత్న కార్యక్రమాలు తెలంగాణ క్రీడ సమాజానికి చేరువయ్యి క్రీడాకారుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా వివిధ క్రీడా కార్యక్రమాల రూపకల్పనకు ఒక చోదక శక్తి లాగా ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు ఒక మంచి క్రీడా వాతావరణానికి దోహదం చేశాయి.