జిల్లా లో వ్యవసాయానికి 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
Jangaonతెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్
జనగామ:జనగామ జిల్లాలో అస్తవ్యస్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయాన్ని కి అవసరమైన విద్యుత్ సరఫరా నిరంతరం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున ఒక ప్రకటన విడుదల చేసి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తుంది అని ఈ వ్యవసాయ సీజన్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు విద్యుత్ సరఫరా చేసి గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది అని అన్నారు
జనగామ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు వైరస్, తెగుళ్లు వల్లన పంటలు దెబ్బతిన్నాయి అని వాటి స్థానంలో రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, వరి పంటలు వేశారని, వీటికి తోడు మిర్చి పంట ఉందని అధిక సాగు నీరు అవసరం ఉన్న నేపథ్యంలో కరెంట్ సరఫరా రైతులకు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంతో పాటు రాత్రి సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రైతులకు, వ్యవసాయం కు అవసరమైన విద్యుత్ సరఫరా నిరంతరం పగటి పూట సరఫరా చేయాలని కోరారు లేని యెడల జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్ ఎదుట DE, SE కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు