బిజెపి, బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ద్రోహులు…….వికలాంగుల కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ ముత్తినేని. వీరయ్య…….ప్రధాని మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే కెసిఆర్ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను పచ్చి మోసం చేశారని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని వికలాంగుల కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ ముత్తినేని. వీరయ్య అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ గురువారం కోదాడ పట్టణంలోని గ్రంథాలయంలో విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. బిజెపిని ఓడించకపోతే రిజర్వేషన్ల ముప్పు ఉందని బిఆర్ఎస్ పార్టీ పదేళ్లు ఉద్యోగాలను సంతలో కూరగాయల మాదిరిగా అమ్ముకుందని విమర్శించారు. జరగబోవు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యం ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు. అశోక్,అమీనా