పెరిగిన బిటి పత్తి విత్తనాల ధరలను తగ్గించి రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ అయినవోలు మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ప్రభుత్వాలు. కంపెనీలు. ఈ ఏడాది బిటి పత్తి విత్తనాలు ధరలు ఒక ప్యాకెట్ కు 43 రూపాయలు పెంచి రైతులపై భారాలు మోపింది గత సంవత్సరం 810(ఎనిమిది వందల పది రూపాయలు) ఉన్న ధర ఈ సంవత్సరం 43 రూపాయలు పెంచి.853 చేసింది పెరిగిన ధరల వల్ల. ఉమ్మడి వరంగల్ జిల్లాలో. పత్తి 4.80 4.లక్షల 80 వేల ఎకరాల నుండి 5 లక్షల ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు. పెరిగిన ధరల వల్ల రైతుల పైన 4.12 కోట్ల నుండి 4.30 కోట్ల వరకు అధిక భారం పడుతుందనీ. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య అన్నారు.జిల్లాలో నకిలీ బిటి. ఇతర విత్తనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి రాకుండా జిల్లా అధికారులు రెగ్యులర్గా షాపులపై తనిఖీలు నిర్వహించాలని నకిలీ విత్తనాలు అరికట్టవలసిందిగా లింగయ్య ప్రభుత్వాన్ని ప్రకటన విడుదల చేస్తూ డిమాండ్ చేశారు