ములుగు జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ ఈ69న్యూస్ ములుగు:మజ్లిస్ ఖుద్దాముల్ అహ్మదీయ్యా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో అహ్మదీయ ముస్లిం యువకులు ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సుమారు వందమంది రోగులకు తాజా పండ్లు పంపిణీ చేయగా,ఆసుపత్రి ఆర్.ఎం.రమాదేవి కి మరియు ఇతర సిబ్బందికి జమాఅత్ అహ్మదీయ్య శాంతి సందేశం,ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ అధినేత హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నాయకత్వంలో ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే దిశగా హ్యుమానిటీ ఫస్ట్,ఖిద్మతే ఖల్ఖ్ శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మౌల్వీ మహమ్మద్ అయాన్ పాషా,యాకూబ్ అలీ,సెక్రటరీ ఖిద్మత్-ఇ-ఖల్క్ మొహమ్మద్ కబీర్ పాషా,సయ్యద్ బషీర్,షేక్ హజ్రత్ అలీ,ఫువాద్ మరియు రమ్లా పాల్గొని తమ సేవలను అందించారు.