మహిళలు సమాజ అభివృద్ధికి ప్రదాతలు మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పి కొడదాం
Nalgondaసమాజంలో సగభాగముగా ఉన్న మహిళలు సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మహిళలు లేనిదే సమాజం ముందుకు పోదని మహిళలపై జరుగుతున్న అఘత్యాలను తిప్పి కొడదామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈరోజు కనగల్లు మండల కేంద్రంలో ఎండి సుల్తానా అధ్యక్షతన కనగల్లు ఐద్వా మండల మహాసభ జరిగింది.
ఢిల్లీ నడివీధులలో ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్‌ను అత్యంత ఘోరంగా అత్యాచారం జరిపి నా నిందితులను కఠినంగా శిక్షించడంలో ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడాల్సిన అవసరం ఉందన్నారు రోజురోజుకు మహిళలపై హత్యలు హత్యాచారాలు వేధింపులు, కిడ్నాప్‌లు వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తలదించుకునేలా ఈ చర్యలను పాలక ప్రభుత్వాలు ఖండించకపోవడం చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మహిళల సంక్షేమం కొరకు ప్రభుత్వాలు పాటుపడడం లేదని అన్నారు ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య వైద్యం ఉచితంగా అందించాలని అన్నారు. మహిళ పొదుపు సంఘాలకు రావలసిన పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలన్నారు మహిళలకు ప్రతి గ్రామంలో బిల్డింగులు నిర్మించి ఇవ్వాలన్నారు. మహిళలను లక్షాధికారులు చేస్తామనే వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు వృత్తి పనులు చేసే వారందరికీ బ్యాంకు వడ్డీ లేకుండా 10 లక్షల రుణాలు అందించాలని కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించామని తెలిపారు గ్రామ మండల జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ప్రజలను కోరారు.
అనంతరం కనగల్లు మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షురాలుగా కుతాడి రాములమ్మ ప్రధాన కార్యదర్శిగా ఎండి సుల్తానా ఉపాధ్యక్షురాలు సుజాత ఉపాధ్యక్షురాలుగా సుజాత పార్వతమ్మ గడ్డం పార్వతమ్మ అరుణ
ఈ కార్యక్రమంలో మండల నాయకులు పద్మ యశోద లక్ష్మి నాగమ్మ వరలక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు