మార్కెట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం అధ్వర్యంలో ధర్నా
Uncategorizedపట్టుగూళ్ల మార్కెట్లో ధరలు, పేమెంట్, ఇన్సెంటివ్, రోగ నిరోధకాలు, పనిముట్లు, సబ్సిడీ సమస్యలపై సెరికల్చర్ సహాయ కమిషనర్ కార్యాలయం, మార్కెట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతరం మీడియాతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ పట్టు రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ శ్రీధర్ రెడ్డి, మెరిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ పట్టు రైతులను తిరుమలగిరి పట్టు మార్కెట్లో చాలా కాలంగా అన్యాయానికి డీలర్లు ఆఫీసర్లు సరైన రేట్లు ఇవ్వక రైతులను నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహం, షేడ్ సబ్సిడీ, రోగ నియోజకవర్గాలు పని యంత్రాలు అందించాలి. అలాగే పట్టు రైతులకు మార్కెట్లో తగిన సదుపాయాలు కల్పించాలి. రైతుకు గౌరవప్రదమైన రేట్లు కనీస ధరను నిర్ణయించాలి. పట్టు రైతుల పట్ల మార్కెట్ అధికారులు వ్యవహరించే తీరు పూర్తిగా మారాలి. రైతు లేనిదే మార్కెట్ లేదని వాళ్ళు గ్రహించాలి. పట్టుగూళ్లకు ఆంధ్ర, కర్నాటక మార్కెట్లతో సమానంగా Rates ను తిరుమలగిరి, జనగామ మార్కెట్ లలో ఇవ్వాలి. పట్టుగూళ్లు అమ్మిన రోజే రైతు Account లో మార్కెట్ నుండి డబ్బులు జమ చేయాలి. జల్లిగూళ్లకు నుంచి పట్టుగూళ్లు Rate లో 1/3 రేటు, డబుల్ గూళ్లకు 1/2 రేటు ఇవ్వాలి. ప్రభుత్వం 2018 నుండి రైతులకు రావాల్సిన ప్రోత్సాహకాలు ( Insentives) 75 రూపాయల ను వెంటనే విడుదల చేయాలి. మినిట్రాక్టర్ మరియు ఇతర పట్టు వ్యవసాయ యంత్ర పరికరాలు, పట్టుపురుగుల రోగనిరోధకాలు 80% సబ్సిడీ తో రైతులకు అందించాలి. ప్రస్తుతం తెలంగాణ sericulture విభాగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పదవీవిరమణ పొందుతున్నారు. వారిస్తానంలో కొత్త వారిని వెంటనే నియమించాలి. ఎందుకంటే వారి సలహాలు, సూచనలు లేకుండా పట్టు వ్యవసాయం లేదుకాబట్టి, రాష్ట్రంలో చాకి సెంటర్ లను పెంచడం, అలాగే పట్టుగుడ్ల డ్రైనేజి ని వెంటనే ప్రారంబించాలి. హైదరాబాద్, జనగామ మార్కెట్లలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. అనంతరం సెరికల్చర్ సహాయ కమిషనర్ సుధాకర్, మార్కెట్ అధికారి ఎం శివకుమార్ లను కలిసి వినతపత్రం అందజేశాము. సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టు రైతులు ప్రవీణ్ రెడ్డి, సక్రు అక్కిరం, అభిమన్య రెడ్డి, మండల రాజు, రఫిక్,రవీందర్, దేవిలల్, వినోద్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.