రజకుల ఎస్సీ జాబితాపై స్పందించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బీజేపీ మ్యానిఫెస్టో , చంద్రబాబు నాయుడు మాటలను నిలబెట్టుకోవాలి
Mahabubnagarశ్రీనివాస్
★ బీసీ రిజర్వేషన్ ను 42 శాతం అమలుచేసిన సీఎం రేవంత్ కు ధన్యవాదాలు - గోపి రజక
భారత దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రజకుల స్థితిగతులపై చాలించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని దృడ సంకల్పంతో దేశవ్యాప్తంగా 56/1984 ఆర్డినెన్సును జారీ చేసిన గొప్ప పరిపాలన దక్షత కలిగిన నాయకురాలిగా ప్రజల మన్ననలను పొందారని నడిమింటి శ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుద్ద భవనంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా యూత్ అధ్యక్షులు బుద్దారం శివకుమార్ అధ్యక్షతన 20-3-2025 గురువారం ఏర్పాటుచేసిన సమావేశానికి నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్,రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతూరి శివన్న హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే వృత్తి చేస్తున్న ఏకైక కులం ధోభీలు అలాంటప్పుడు భిన్న రిజర్వేషన్లు ఉండటం వల్ల ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు తలెత్తుతాయని అది ధోభీ కులానికే చాలా ప్రమాదకరమని తన ఆవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుములు రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26న అసెంబ్లీలో చెప్పిన మాటలను , కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు రాహుల్ గాంధీ ప్రచారంలో ఎస్సీ జాబితాలో చేర్చాలని అన్నమాటలను, యువ గళం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు స్పందించిన ఎస్సీ అంశాన్ని,2018 మ్యానిఫెస్టోలో ఎస్సీ జాబితాలో చేర్చుతామన్న బీజేపీ పార్టీ వాగ్దానాలను అమలు చేయాలని కోరారు.ఎస్సీ జాబితాలో చేరెందుకు అన్ని విధాలుగా రజకులు అర్హులే కావున దేశ,రాష్ట్ర ప్రధాన పార్టీలు మరియు ఎస్సీ కుల సంఘాలు అనుకూలంగా ఉన్నాయని వారన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి తక్షణమే పంపాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా యూత్ సంయుక్త కార్యదర్శి సిహెచ్ మనోహర్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మడెలయ్య నాగేష్ తదితరులు పాల్గొన్నారు