రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గణేష్ నవరాత్రుల సందర్బంగా మండపాల వద్ద ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే విధంగా, ప్రజాశాంతి భంగం కలిగించే విధంగా డీజే లను శబ్ద కాలుష్యాన్ని చేయకూడదని ఎస్ ఐ అజయ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో డీజే ఓనర్లను, ఆపరేటర్లను పిలిపించి మాట్లాడారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించిన యెడల డీజే ఆపరేటర్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని డీజే లను సీజ్ చేయబడునని తెలిపారు. డీజే ఓనర్స్,ఆపరేటర్ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.