హనంకొండ మండలం కాజీపేట మైనారిటీ గురుకుల బాలురు పాఠశాలలో (కడిపికొండ) విద్యార్థుల ఖురాన్ పఠనం పూర్తయిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మూల్వి మహమ్మద్ రియాసుద్దీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటే కాబట్టి అందరూ విద్యార్థులు కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలని చెప్పడం జరిగినది మరియు కష్టపడి మంచిగా చదివి స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ ఆఫీసర్స్ మహమ్మద్ అంజద్ మరియు యాకూబ్ పాషా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ తనుగుల మరియు పాఠశాల సిబ్బంది మొహమ్మద్ ఆబిద్ (పిజిటి ఉర్దూ) మొహమ్మద్ హుస్సేన్ (టీజీటీ ఉర్దూ) ఎన్ బిక్షపతి (టీజీటీ తెలుగు) సుధారాణి (పిజిటి తెలుగు) తదితరులు పాల్గొన్నారు.