సీపీఎం చాంద్రాయణగుట్ట జోన్ కమిటీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Hyderabadఈ కార్యక్రమం సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం డి అబ్బాస్ గారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత దేశ రాజ్యాంగం పై దాడి చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని అనేక ప్రయత్నం చేస్తోంది.మనువాదా సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని ముక్త కంఠం తో దేశ ప్రజలు ఖండించాలనిప్రజలను కోరారు. అదేవిధంగా అధికారానికి ఆసరా చేసుకుని దేశంలో దళితుల, గిరిజన, మైనార్టీ, మహిళలపై దాడులు చేస్తున్నారు. మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా విశ్లేషకులపై కూడా దాడులు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ధరల నియంత్రణకై, ఉపాధి, ఉద్యోగ కల్పన పై దృష్టి సారించని పరిస్థితి ఏర్పడింది. అడ్డు అదుపు లేకుండా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నరు. ధరలు తగ్గించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే అన్ని సంస్థలు కార్పొరేట్ వారికి అప్పనంగా కట్టబెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. అన్నారు. అంబానీ, ఆధాని ల ప్రభుత్వం లాగా ఉందని దువ్వబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానలు ఇప్పటికి అమలు చేయడం లేదు. ముక్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు. వెంటనే ఇండ్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు వారికి వెంటనే డబుల్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. లేకుంటే తగిన మూల్యం రాష్ట్ర ప్రభుత్వం కి తప్పదు అని అన్నారు. కావున వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినా వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గణతంత్ర దినోత్సవ స్పూర్తితో ఉద్యమిస్తము అని ప్రభుత్వ లకి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపియం చాంద్రాయణగుట్ట డివిజన్ కార్యదర్శి ఎస్. కిషన్, md గౌస్, స్వామి, జీవన్, ముక్తర్, ఫర్జాన, అష్మా, పర్వీన్, శేఖర్, అబ్బు, చాప నర్సింహ,తదితరులు పాల్గొన్నారు.