హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ :- సెప్టెంబర్ 26న పాడిరైతుల సమస్యలపై ధర్నాను జయప్రధం చేయండి.తెలంగాణ పాలఉత్పత్తిదారుల సంఘం, టి.జి విజయ డెయిరీ పరిరక్షణ సమితి
Hyderabad రాష్ట్రంలో పాడిరైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకోసం తెలంగాణ పాలఉత్పత్తిదారుల సంఘం, టి.జి విజయ డెయిరీ పరిరక్షణ సమితి రాష్ట్ర కమీటిల ఆధ్వర్యంలో ఈ నెల 26 గురువారం రోజున ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద జరుగు పాడిరైతుల ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని ఆర్.టి.సి క్రాస్ రోడ్ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ధర్నా పోస్టర్లను ప్రోఫెసర్ అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సాగర్ మాట్లాడుతూ పాడిరైతులకు జులై 15 నుండి అక్టోబర్ 1 వ వరకు ఐదు పాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. డైరి పామ్ నిర్వహణ కోసం కొంతమంది ప్రైవేట్ బ్యాంక్ లలో అప్పులు తెచ్చి నెలసరి కిస్తీలు, అలాగే మహిళ సంఘాలలో నెలసరి కిస్తీలు, డైరి నుండి ఆయా జిల్లాలో ఉన్న వివిధ బ్యాంక్ లలో ముద్ర లోన్స్, ఇప్పించిన పరిస్థితిలో పాడిరైతులకు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాడిరైతుల యొక్క సీవిల్ పడిపోయి బయట లోన్స్ రాకుండ పాడిరైతులలో తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారని అన్నారు. పాడిరైతులకు బిల్లులను 15 రోజులకోకసారి ఖాతాలలో జమచేయాలని అన్నారు. లీటరుకు 5 రూపాయల ప్రోత్సహకం ఎన్నికల హామీని అమలు చేయాలని అన్నారు. మీండల్ మీక్షర్, క్యాలిసీయం, దాణా,75% సబ్సిడీతో.పాడి సంరక్షణ మందులు గడ్డి విత్తనాలు 75% సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. పాల టెస్టర్లు, గడ్డి కోసే మీషన్, గడ్డి కటింగ్ మీషన్, పాలు పిండే మీషన్,మీల్క్ అనలైజర్లు 75% సబ్సిడీలతో పంపిణి చేయాలని కోరారు. పశుపోషన పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వమే ఫ్రిమియం చెల్లించాలని అన్నారు. రైతుల ఇంటి వద్దకి పశువైద్య సౌకర్యం మోభైల్ వ్యాన్ల ద్వారా అందించాలన్నారు. పాడి రైతుల పిల్లల చదువులకు స్కాలర్ షిఫ్లు ఇవ్వాలని అన్నారు. పశు సంవర్థక శాఖలో కాళీలను భర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 50కోట్లు విడుదల చేసినట్లుగా నిన్న డైరి యాజమాన్యం ప్రకటన చేయడం పాడిరైతులను ఐక్యం కాకుండ 26 ధర్నా కార్యక్రమంకు అడ్డుకోవడం కోసం మాత్రమే అని అన్నారు ఇంకా 100 కోట్లు మిగిలిన డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని అంటున్నారు. 150కోట్ల రూపాయలకు కేవలం 50కోట్ల రూపాయలు విడుదల చేయడం వల్ల పాడిరైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.