తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ గారిని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ గారిని కలిసి పాఠశాలలో ఉన్న సమస్యలు వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ములుగు నియోజకవర్గంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు మరియు కళాశాలలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్దులు త్రీవ అందోళనకు గురవుతున్నారు. కావున, ఈ క్రింద తెలుపబడిన మరమ్మత్తులు మరియు సౌకర్యాలను కల్పించాలని కోరుచున్నాను.

  1. 2022-23 అకాడమిక్ విద్య సంవత్సరం పూర్తి కావడానికి మూడు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ కనీసం ఇప్పటి వరకు విద్యార్దులకు యూనిఫాం ఇవ్వలేదు, వెంటనే విద్యార్దులకు యూనిఫాంను సౌకర్యం కల్పించాలి.
  2. ప్రధానంగా వందలాది మంది విద్యార్ధులు ఉండే ఆశ్రమ పాఠశాలలు ఎక్కడ ఎక్కడో అడవులల్లో ఉండటంతో విద్యార్ధులు అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స చేయడానికి ఏఎన్ఎంలు లేక త్రీవ ఇబ్బందికి గురవుతున్నారు, వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలి.
  3. కొన్ని పాఠశాలలలో తరగతి గదులనే డార్మేటరిలుగా ఉపయోగిస్తున్నందున పిల్లలు చాల ఇబ్బందులు పడుచున్నారు, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.
  4. ఆశ్రమ పాఠశాలలో ఉండే విద్యార్థులకు అనారోగ్యంతో ఏదైనా పెద్ద సమస్యకు గురైతే దూర ప్రాంతంలో ఉండే హాస్పిటల్ కు వెళ్ళడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చెయ్యాలి.
  5. ఆశ్రమ పాఠశాలల పాత బిల్డింగులు శిథిలావస్థలో ఉన్న స్థానములో నూతన బిల్డింగులు మంజూరు చేయాలి.
  6. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు మరియు ఇతర ఎలక్ట్రికల్ సమస్యలు పునరుద్దరించాలి.
  7. విద్యార్దుల తాగు నీటి సమస్యను పరిష్కరించాలి.
  8. తరగతి గదులకు మరియు టాయిలెట్లకు డోర్స్ లేకపోవటంతో విద్యార్దులు చాలా ఇబ్బందులు పడుచున్నారు. కావున, వెంటనే సమస్యను పరిష్కరించాలి.
  9. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో విద్యార్ధులు ప్రపంచ జ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్ ఆపరేటరుని నియమించి, పిల్లలకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలి మరియు ప్రొజెక్టర్ ఉన్నప్పటికీ దానిని మెయింటెనెన్స్ చేయకపోవటం వలన పని చేయటం లేదు. కావున, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి.
  10. పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో ఆహరం తీసుకునేందుకు డైనింగ్ హాలులో ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి.
  11. ఆశ్రమ పాఠశాలలలో పి.ఈ.టి. టీచర్లు మరియు భోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి.
  12. ఆశ్రమ పాఠశాలలలో విద్యార్ధుల మనోవికాసానికి దోహదం చేసే ఆట వస్తువులు మరియు ఆట స్థలంములో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
  13. క్యాజువల్ మరియు డైలీ వెజ్ లేబర్లు గత 30 రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి దీక్ష చేస్తున్నారు, ఈ కారణంగా పిల్లలు చాలా ఇబ్బందులు పడుచున్నారు. కావున, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీతక్క గారు లేఖ లేఖలో పేర్కొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *