. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిధిలోని బోయపల్లిబోర్డు వేణునగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం లో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం సేవా జ్యోతి శరణాలయం విద్యార్థులు శివతేజ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని ప్రతి ఇంట్లో ఇలాంటి జ్ఞానజ్యోతిని వెలిగించే శ్రీ దత్తాత్రేయ జయంతి లాంటి వేడుకలు నిర్వహించి నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలి,మరియు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను తెలియజెప్పి విద్యార్థులను జ్ఞానజ్యోతులుగా తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు తెలియ జెప్పాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి, సేవాజ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్ సగర, సేవికప్రముఖ్ నాగమణి, లక్ష్మీ, కృష్ణ, శ్యాం, శంకరం, శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *