హనుమకొండ: ఎస్సై కానిస్టేబుల్ ఈవెంట్స్ లో రన్నింగ్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ లో అవకాశం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య(డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడారు గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన హైకోర్టు ఆర్డర్ ను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, పాత పద్ధతిలోనే లాంగ్ జంప్ సంబంధించిన పురుషులకు 3.8, మహిళలకు 2.2 ఉంటే 4 మీటర్లు పురుషులకు, 2.5 మహిళలకు , షార్ట్ పుట్ పురుషులకు 5.6 నుంచి, ఆరు మీటర్లు, మహిళలకు 3.75 నుంచి నాలుగు మీటర్లు నిర్వహించడం వల్ల చాలామంది నిరుద్యోగులు అర్హత సాధించలేకపోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభ్యర్థులు నష్టపోయారని, ఉద్యోగాలు ఇస్తామంటూనే, అనేక ఆంక్షలు పేరుతో ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. రన్నింగ్లో అర్హత సాధించిన వారికి అవకాశం కల్పించాలని హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, మాటూరి సతీష్, గంధసిరి బిక్షపతి, చిలుక జంపయ్య, ఇటికాల భాస్కర్, యం.తిరుపతి, పున్నం సంతోష్, పోడేటి కుమార్, యం.శ్రీనివాస్, పీ. మహేందర్, యం. రంజిత్, జె. కృష్ణమూర్తి, ఆర్ సతీష్, శ్రీకాంత్, యేసు, మురళి పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *