సీపీఐ(ఎం)పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్
హైదరాబాద్ జిల్లా, పలక్ నామా లోని రవింద్ర నాయక్ నగర్ గిరిజనుల పైన అధిక మొత్తంలో విద్యుత్ ఛలానాలు వేయవద్దని TSSPDCL సిఎండి G. రుకుమా రెడ్డికి సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ….
విద్యుత్ దొంగతనం అనే పేరుతో రవీందర్ నాయక్ నగర్ ప్రజల మీద అధిక మొత్తం చలాన్ విధిస్తూ పేద గిరిజనులకు ఇబ్బంది కలిగించే విధంగా విద్యుత్ అధికారులు వ్యవహరిస్తున్నారని, వేలలో ఛలాన్ వేసి గిరిజనుల పై భారాలు వేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. 2018లో ప్రభుత్వమే వంద యూనిట్లు ఉచితంగా గిరిజనులు వాడుకోవచ్చని ప్రకటించగా దాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా ఛలాన్లు వేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఏ మాత్రం అవగాహన కల్పించకుండా, నేరుగా నోటీసులు ఇచ్చి, కేసులు పెట్టి వేధించడం సరికాదని అన్నారు. గతంలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన పొరపాటుకు ప్రస్తుతం కేసులు పెట్టడం అన్యాయం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు 30 నుండి 70 గజాల్లో చిన్న ఇళ్ళలో జీవిస్తున్న పేదలు వేలలో విద్యుత్ చార్జీలు బిల్లు వేయడం ఇబ్బందికరంగా ఉన్నది. పరిస్థితి కరోనా లాక్ డౌన్ కాలంలోనే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇలాంటి స్థితిలో కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచుతూ నెలలు తిరగక ముందే వేళల్లో కొత్త బిల్లు రావడం అనేది జరుగుతుంది. ఈ సమస్యల పైన టిఎస్ఎస్పిడిసిఎల్ సి.ఎం.డి రుకుమా రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు బాలు నాయక్, కృష్ణ, కిషన్ ,రామ్ కుమార్, శీను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *