మహిళలకు స్పూర్తి ప్రధాతమహిళలకు స్పూర్తి ప్రధాత

మహిళలకు స్పూర్తి ప్రధాత,ఆరాధ్య దైవం బాబాసాహేబ్ అంబేద్కర్ అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. ప్రపంచ మేధావి, బహుజనుల ఆరాధ్య దైవం,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా సిమెంట్ నగర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్తేరమ్మ, యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అద్యక్షురాలు నంది విజయలక్ష్మి లు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ హిందూకోడ్ బిల్లు ద్వారా సమాజంలో మహిళకు సముచిత స్థానం కల్పించేందుకు, సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువ లేనిదని, కామన్ కోడ్ బిల్లు ద్వారా చరిత్రలోనే కాకుండా మహిళల జీవితాలలో కూడా ఆరాధ్య దైవంగా చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి ఆదర్శనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మమతా, ఎం.పి.టి.సి ఇందిరమ్మ మహిళా ఐక్య వేదిక నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ముడియం సునీత, ఆకుతోట పద్మావతి, పాణ్యం నియోజకవర్గ డివిజన్ అధ్యక్షురాలు కటికె భాను, బేతంచర్ల మండల అధ్యక్షురాలు కొమ్ము పెద్దక్క,సిమెంట్ నగర్ అధ్యక్షురాలు మహాలక్ష్మీ, డోన్ మండల కార్యదర్శి ప్రభావతి, మరియు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *