పంచాయతీ కార్యాలయాల్లో సమ్మె సైరన్‌ మోగనుంది.తమ సర్వీస్‌ను క్రమబద్ధీ కరించాలనే డిమాండ్‌తో మండలంలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల జెఏసి జిల్లా అధ్యక్షుడు ఎండి.అబ్దుల్ ఫరీద్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ అధికారి జగదీష్ ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు.28వ తేదీలోగా తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమై న ప్రకటన చేయకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ మా పనితీరును ప్రభుత్వం అర్థం చేసుకుని, ప్రొబేషనరీ పీరియడ్‌ను డిక్లరేషన్‌ చేసి సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేసే వారిని కూడా జేపీఎస్‌లుగా పరిగణనలోకి తీసుకునీ, వారి సర్వీస్‌ను లెక్కించాలన్నారు.దీనిపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించకుంటే సమ్మె తప్పదనీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *