అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు మహేష్

గత పదిహేను రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలని కోరుతూ , వారినీ రెగ్యులరైజ్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న పంచాయితీ సెక్రటరీ ల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటూ వారి పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు, వారు డిమాండ్లను నెరవేర్చకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పంచాయతీ కార్యదర్శులను పట్టించుకోకపోగా,ఉద్యోగంలో చేరకపోతే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడంతో మనస్తాపానికి గురై, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో భైరి సోని అనే ఉద్యోగిని గ్రామ పంచాయితీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది,పదివేల మంది జెపిఎస్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఉద్యోగుల చావుకు కారణమైనది. ప్రభుత్వం వెంటనే
భైరి సోని కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని, వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని , డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ , సోని ఆత్మ కు శాంతి కలగాలని కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది, అదే విధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు , ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ ఇంఛార్జి కనకం బాబు, నియోజకవర్గ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు యామని సుంకన్న , అలంపూర్ మండల అధ్యక్షులు నాగరాజు, మండల కన్వీనర్ సురేష్, సంతోష్ నగర్ బూత్ అధ్యక్షులు సుధాకర్ , బీఎస్పీ నాయకులు ఆర్. స్వామెలు,పీటర్, అరవింద్,బాలరాజు,కిరణ్, హానుకు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *