తల్లిపాలే పుట్టిన బిడ్డకు అమృతం…సిడిపిఓ శిరీషతల్లిపాలే పుట్టిన బిడ్డకు అమృతం…సిడిపిఓ శిరీష

తల్లిపాలే పుట్టిన బిడ్డలకు అమృతం లాంటివని వాటి విలువను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని మరిపెడ ఐసిడిఎస్ సిడిపిఓ శిరీష అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలి వారి గూడెం గ్రామంలో అంగన్వాడి 1,2,వ సెంటర్ లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణీ మహిళలకు సిమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ శిరీష, గ్రామ సర్పంచ్ ఎడెల్లి రామయ్యలు, హాజరై అక్షరాభ్యాసం తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిరీష మాట్లాడుతూ తల్లి పాల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం గర్భిణీ స్త్రీలకు చేయాలని సూచించారు. భవిష్యత్తును నిర్ధేశించే ఆరోగ్యవంతమైన యువత తల్లి పాల ద్వారానే సాధ్యమన్నారు.తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడంపై పూర్తి అవగాహన కల్పించారు.తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని బిడ్డకు మొదటి టీకా తల్లిపాలేనని, తాగితే బిడ్డకు తాపిస్తే తల్లికి ఎన్నో విధాలైన ప్రయోజనాలు ఉంటాయని కావున ప్రతి ఒక్కరూ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే తాపించాలని బిడ్డకు రెండు సంవత్సరాలు వయసు వచ్చినంత వరకు తల్లిపాలు ఇవ్వవచ్చునని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యంగా తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది ఆశ, ఏఎన్.ఎంలు‌‌ అంగన్వాడీ టీచర్స్ అవగాహన కల్పించాలని, కాన్పు వారు అరగంటలోపు తల్లిపాలు బిడ్డకు ఇచ్చేటట్లు ప్రోత్సహించాలని ముర్రుపాలలో బిడ్డకు ఉపయోగపడే అనేక పోషక విలువలు, వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని వారు తెలిపారు.అదేవిధంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనత నివారణ కొరకు పరీక్షలు చేయించుకోవాలని రక్తహీనత లేకుండాచూసుకోవాలన్నారు.అనంతరం సూపర్వైజర్ శ్రీలత చేతుల మీదుగా గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. పౌష్టిక ఆహార కిట్లను అందించారు. అంగన్వాడి సెంటర్ పిల్లలకు నూతన అక్షరాభ్యాసం చేశారు. అంగన్‌వాడీలు తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్వతంత్ర భారత వారోత్సవాల వేడుకల రోజువారి కార్యక్రమాలను వారికి వివరించాలని, కోరారుఈ కార్యక్రమంలో అబ్బాయిపాలెం సెక్టర్ సూపర్వైజర్ విజయలక్ష్మి , గ్రామపంచాయతీ కార్యదర్శి సరిత, ఎమ్ ఎల్ హెచ్ పీ డాక్టర్ తరుణి, సైన్స్ టీచర్ మురళీధర్, అంగన్వాడి టీచర్ లు సిహెచ్ రాములమ్మ, హెచ్ అచ్చమ్మ, టీ లలిత, ఏఎన్ఎం స్వప్న, ఆశా కార్యకర్తలు, ఎడెల్లి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *