జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలుజర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు

జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.మండల కేంద్రంలోని జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.రేషన్ గిడ్డంగుల నుంచి దళారులు నేరుగా రేషన్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా నిల్వ చేసి దందా నిర్వహిస్తున్నారన్న సమాచారంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి, ఘటనపై కేసు నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వ, తరలింపు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *