సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు డిమాండ్
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం,జూన్09(తెలుగు గళం) న్యూస్:జిల్లాలోని పిహెచ్సీలలో ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం ల మూడు నెలల పెండింగ్ జీతాలను విడుదల చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పిపి యూనిట్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం లను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి ఏఎన్ఎం లకు రావలసిన జీతాలు విడుదల చేయక ఏఎన్ఎంలు కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే అరకొర జీవితంలోనే వారి యూనిఫారాలు కూడా కొనుక్కోమని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే ఏఎన్ఎం లకు యూనిఫాం అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు పని భద్రత లేదని వారికి పీఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యం కూడా సక్రమంగా అమలు కావట్లేదని ఆరోపించారు. అధికారులు వీరితో చాకిరి చేయించుకోవడమే తప్ప వారి జీతాల కోసం వారి భద్రత కోసం ఏమాత్రం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోయినా పట్టించుకోని జిల్లా అధికారులు పనిచేయాలంటూ ఏఎన్ఎంలపై తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని దీని వలన ఏఎన్ఎంలు మానసిక ఇబ్బందులకు కూడా గురవుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని పిఎస్సీలలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు పెండింగ్ జీతాలు తక్షణమే విడుదల చేసి వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు యూనిఫామ్ అలవెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో’: విజయలక్ష్మి, సోనియా, అనిత, శ్రీ సమ్మక్క,భవాని, జ్యోతి పాల్గొన్నారు.