సిఐటియు యూనియన్ లో చేరిన బీడీ కంపెనీ టేకదారులు

ఈరోజు కాచాపూర్ శివాజీ బీడీ కంపెనీకి చెందిన 49 మంది టేకదార్ల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో టేకదర్లందరూ ఏకగ్రీవంగా సిఐటియూ లో చేరుతున్నట్టుగా తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ అనేక రోజుల నుండి తేకదారులందరూ అటు కంపానితో ఇటు మేనేజ్మెంట్తో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అతి తక్కువ కమిషన్ తో కార్ఖానా నడిపిస్తున్నారు రాబోయే రోజుల్లో బీడీ టేకర్లందరికి జీవన భృతి తో పాటు ప్రత్యేకమైన జీవో తెస్తూ టే కదారులకు కమిషను మరియు వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద ఎల్లప్పుడు పోరాడుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కర్రోల్ల సత్యం బిడిటేకాదారులు నరహరి భూపాల లక్ష్మణ్ శేఖర్ సచిన్ శివానందం రమేష్ నర్సింలు పోచయ్య లక్ష్మీపతి నర్సింలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *