నిజాయితికి భరోసా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోకిల సత్యనారాయణకు గన్‌మెన్‌ల కేటాయింపు



వరంగల్ జిల్లాలో తొలిసారివరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌, ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోకిల సత్యనారాయణకు రక్షణగా ప్రభుత్వం ఇద్దరు గన్‌మె న్లను నియమించింది. నగర పోలీసు కమిషనర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో వారు విధుల్లో చేరారు. గన్ మెన్లను ఎందుకు ఇచ్చారు.ఉమ్మడి జిల్లాలో సంచలనాలు సృష్టించిన ఎన్నో కేసుల్లో ఆయన వాదనలు వినిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోకిల సత్యనారాయణ కృషి చేశారు. మరో మూడు సంచ లన కేసులను వాదిస్తుండడంతో ఆయనకు ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.ఇప్పుడు అసలేం జరిగింది.?జిల్లాలో తల్లిపక్కన పడుకున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి హతమార్చిన కేసు, తొమ్మిది మందిని చంపి బావిలో పడేసిన ‘మృత్యుబావి’ కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్ష వేసేలా సత్యనారాయణ వాదనలు వినిపించా రు. ములుగు జిల్లా కోర్టులో న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసుకు, వరంగల్‌ జిల్లా కోర్టులో పూజారి హత్య కేసుకు, మహబూబాబాద్‌ జిల్లా కోర్టులో ఓ విలేఖరి కుమారుడిని (9 నెలల) డబ్బుల కోసం అపహరించి, హత మార్చిన కేసులకు సంబంధించి ప్రభుత్వం ఈయ నను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *