విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపొందించేందుకు సమిష్టి కృషి అవసరం
జిల్లాలోని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసం, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమం పై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థుల్లో మానసిక వికాసం,ఆత్మవిశ్వాసం పెంపొందించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు మానసిక స్థైర్యంతో పాటు మంచి ఆహార అలవాట్లు, సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థుల మానసిక వికాసం కోసం నిపుణులతో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించారు.మెడికల్ ఆఫీసర్లు, పాఠశాలలు, గురుకులాల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.విద్యార్థుల మానసిక స్థితిని నాలుగు కేటగిరీలుగా- రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్‌గా గుర్తించి, సమస్యాత్మక స్థాయిలో ఉన్న పిల్లలకు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్లతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో
డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య,జిల్లా సంక్షేమ అధికారి జయంతి,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్,డీటిడీవో ప్రేమకళ,సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల,జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ హైదర్,చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్.ప్రవీణ్ కుమార్,గురుకుల విద్యాలయాల డీసీఓలు ఉమా మహేశ్వరి,ప్రసాద్,సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్,ఆర్సీఓ రాజ్ కుమార్,ఏఎంవో సుదర్శన్ రెడ్డి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ తదితర అధికారులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.