553 బస్సుల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగింత
•553 బస్సుల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగింత
•వడ్డీలేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి| జూన్ 09
వరంగల్ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళా శక్తి వారోత్సవాలకు పర్వతగిరి మండలం నుంచి ఎస్‌హెచ్‌జీ గ్రామైక్య సంఘాల ప్రతినిధులు,మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మదర్ థెరిసా మండల సమాఖ్య ఆధ్వర్యంలో,ఏపీఎం రాజిర్ సారథ్యంలో వివిధ గ్రామాల గ్రామైక్య సంఘాల ప్రతినిధులు ఆర్టీసీ బస్సులో బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర స్థాయి మహిళా శక్తి సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అప్పగించారు. అంతేకాకుండా మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు ఉన్న వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.మహిళా శక్తి వారోత్సవాలకు తరలివెళ్లిన వారిలో మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న,కార్యదర్శి రజిత,ఫరీదా, సీసీలు కొమురయ్య, సుధాకర్, దేవేంద్రతో పాటు మండలంలోని అన్ని గ్రామాల గ్రామైక్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.