ఎన్నికల ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి
ఎన్నికల నిర్వహణ కి సంబందించిన ప్రతీ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘ నియమ నిబంధన లకు అనుగుణంగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.దేవరుప్పుల,కొడకండ్ల,పాలకుర్తి మండలాల లో సోమవారం
కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.దేవరోప్పుల,కొడకండ్ల,పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయలను సందర్శించి నామినేషన్ స్క్రూట్ ని ప్రక్రియను పరిశీలించారు.రాష్ట్ర ఎన్నికల సంగం సూచించిన నియమ నిబంధనకు లోబడి స్క్రూట్ ని ప్రక్రియ జరగాలన్నారు.ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలని తెలుసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను అందరికి ఇవ్వాలన్నారు.స్ట్రాంగ్ రూమ్,సీసీ కెమెరా ల ఏర్పాటు గురించి పలు సూచనలను ఇచ్చారు.కొడకండ్ల మండలం లోని…ఎస్సి బాలుర,బాలికల హాస్టల్ ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేసి… పరిసరాలను, వంట గదిని,బాలుర విద్యార్థుల గదులను పరిశీలించారు.ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపించాలని….తాజా కూరగాయలను,నాణ్యమైన వంట సరుకులను మాత్రమే వాడాలని సూచించారు.చలికాలం సందర్బంగా….విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ లు, తహసీల్దార్ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు