ఈ69న్యూస్ జనగామ జనగాం జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు,మరిగడి గ్రామ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు,రైస్ మిల్ అమాలి యూనియన్ (CITU) జనగాం డివిజన్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చామకూర రాములు ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు.కార్మిక ఉద్యమాలకు అండగా నిలిచి,పేదల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండిన ఆయన మరణం పార్టీకి,కార్మిక వర్గానికి తీరని లోటు.రాములు సాధారణ కార్మికుల జీవన ప్రమాణాల కోసం నిరంతరం పోరాడి,సామాజిక న్యాయం సాధనలో తన జీవితాన్ని అంకితం చేశారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.