గాలివారిగూడెం వెళ్లే దారిలో పొంచి ఉన్న ప్రమాదం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామ పంచాయతీ కి వెళ్లే పంచాయతీ రాజ్ రోడ్డు కు వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావికి రక్షణ గోడ ఏర్పాటు చేయాలని వాహనదారులు, గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రోడ్డు పక్కనే బావి ఉండటంతో వెళ్లే దారిలో బావికి అడ్డుగా ఎలాంటి చాటు లేక బావి ఓపెన్‌గా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంగుండా ప్రజలు, వాహనదారులు మరిపెడ బంగ్లా, మహబూబాబాద్, ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు మూల మలుపు సమీపంలో ఉన్న బావితో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న బావి కి ఇనుప కంచెలు కానీ అడ్డుగా గోడ కానీ నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.