గొడవల పరిష్కారం–రాజ్యాంగ మార్గమే శాశ్వతం
Uncategorized #గ్రామ పంచాయతీ, #పోలీస్ స్టేషన్, #వరంగల్, #హైకోర్ట్, #హైదరాబాద్
ఈ69న్యూస్ డెస్క్ ప్రతినిధి
మన సమాజంలో వ్యక్తిగతం,కుటుంబం,గ్రామం,ఆస్తి వంటి విషయాల కారణంగా తరచూ గొడవలు, పంచాయితీలు తలెత్తుతుంటాయి.ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఇప్పటికీ “గ్రామ పెద్దల తీర్పు”మీద ఆధారపడుతున్నారు.కానీ రాజ్యాంగం ప్రవేశించిన తర్వాత న్యాయం చేయగల అధికారం కేవలం కోర్టులకే ఉంది (భారత రాజ్యాంగం Article 32, Article 226 ప్రకారం).
*“గ్రామస్థాయి పరిష్కారం”*
73వ రాజ్యాంగ సవరణ (1992) ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు అధికారం ఇచ్చారు.చిన్న చిన్న వివాదాలు,సరిహద్దు సమస్యలు,సామాజిక విషయాలను గ్రామ సభ లేదా గ్రామ న్యాయాలయం (Gram Nyayalaya Act, 2008) పరిష్కరించవచ్చు.కానీ వీటి తీర్పులు పెద్ద నేరాలు లేదా ఆస్తి వివాదాలకు వర్తించవు.
*“నేరాల పరిష్కారం–పోలీస్ అధికారాలు”*
ఏదైనా గొడవ హింసకు దారితీస్తే,దాడులు,దొంగతనాలు,మోసాలు,మహిళలపై దాడులు వంటి నేరాలు జరిగితే,వీటిని ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం విచారించాలి.
*“IPC Section 323–దాడి/శారీరక హాని”*
*“IPC Section 379–దొంగతనం”*
*“IPC Section 420–మోసం”*
*“IPC Section 354-మహిళలపై దాడి/అవమానం”*
ఈ కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు చేసి,పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు పంపిస్తారు.
*“కోర్టుల పరిధి”*
పెద్ద ఆస్తి వివాదాలు,వారసత్వ సమస్యలు,సివిల్ కేసులు,రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలు అన్నీ కోర్టులోనే పరిష్కారం అవుతాయి.
*“Civil Procedure Code (CPC,1908)–సివిల్ వివాదాలు”*
*“Criminal Procedure Code (CrPC,1973)–క్రిమినల్ కేసుల ప్రక్రియ”*
*“Article 32–సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు”*
*“Article 226–హైకోర్టును ఆశ్రయించే హక్కు”*
*“సాంప్రదాయ పంచాయితీల స్థితి”*
గ్రామ పెద్దలు,కుల పెద్దలు చేసే“జాతి పంచాయితీలు”లేదా“కట్నం పంచాయితీలు”రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధం కావు. వీటి తీర్పులు వ్యక్తిగతంగా సలహా మాత్రమే.ఎవరికైనా అన్యాయం అనిపిస్తే ఎప్పుడైనా పోలీస్ లేదా కోర్టుకు వెళ్ళవచ్చు.నేటి సమాజంలో శాంతి,న్యాయం నిలవాలంటే,గొడవలు వచ్చినప్పుడు భావోద్వేగాలకు లోనై అనధికారిక తీర్పులకు లోబడకూడదు.రాజ్యాంగం ఇచ్చిన చట్టబద్ధమైన,పోలీస్ స్టేషన్, కోర్టులు మాత్రమే శాశ్వత పరిష్కారం ఇస్తాయి.