జఫర్ఘఢ్ లో యూరియా కొరతపై రైతుల ఆందోళన
Uncategorized #e69news, #ghanpur, #Jangoan, #warangal, #zaffarghad
జఫర్గడ్-వర్ధన్నపేట రహదారిపై రెండున్నర గంటల రాస్తారోకో
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని,కావాలనే యూరియా సరఫరాను పూర్తిస్థాయిలో చేయకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం జఫర్గడ్-వర్ధన్నపేట ప్రధాన రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున చేరి రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేపట్టారు.అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.రాష్ట్ర స్థాయిలో యూరియా కొరత-రాష్ట్రానికి వాస్తవ అవసరం:-10.48 లక్షల మెట్రిక్ టన్నులు,కేంద్రం కేటాయింపు:-9.30ఎల్ఎంటి.ఇప్పటివరకు సరఫరా:5.62ఎల్.ఎం.టి,2.68 ఎల్.ఎం.టి జనగామ జిల్లాకు ఖరీఫ్ సీజన్లో రావలసిన యూరియా 80,000 ఎంటి అందింది కేవలం 6,000 ఎం.టి మాత్రమే.దీంతో 2000 ఎం.టి లోటు ఏర్పడింది.
ఏవో నిర్లక్ష్యం – రైతుల ఇబ్బందులు
సాధారణంగా ప్రభుత్వ రేటు రూ.266 ఉన్న యూరియా బస్తా, బ్లాక్ మార్కెట్లో రూ.300–400కి విక్రయమవుతోందని రైతులు ఆరోపించారు. సరఫరా పూర్తిగా లేకపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తోందన్నారు.అదే సమయంలో,మండలానికి యూరియా వచ్చినా సరఫరా విషయంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఎరువులు అందుకోలేకపోయారని,రైతు నాయకులు తీవ్రంగా విమర్శించారు.మొక్కజొన్న,పల్లి వంటి ప్రత్యామ్నాయ పంటలకు యూరియా అత్యంత అవసరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని పోలీసులు ద్వారా ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని రాపర్తి సోమయ్య మండిపడ్డారు.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తక్షణమే ప్రారంభించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.లేదంటే రైతులు ఐక్యంగా ఉద్యమం ముమ్మరం చేస్తారని హెచ్చరించారు.ఈ నిరసనలో రైతు సంఘం నేతలు నక్క యాకయ్య,వడ్లకొండ రాజు,అన్నెపు ప్రభాకర్,నాగయ్య,సింహాద్రి,సుధాకర్,ఎండి భాష,అంకుస్,జల్లెల్ల శ్రీను,కాటా సుధాకర్,సిరికొండ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.సుమారు 500 మంది రైతులు ఈ రాస్తారోకోలో భాగమయ్యారు.