ఈ69న్యూస్ పరకాల,సెప్టెంబర్ 11: పరకాల మాజీ ZPTC సిలువేర్ మొగిలి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.