ఈ69న్యూస్ హైదరాబాద్,సెప్టెంబర్ 2 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కే.కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తన,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పార్టీ పేర్కొంది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర్ రావు తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్‌కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి టి.రవీందర్రావు ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించారు.