ఈ69న్యూస్ వరంగల్:ఎస్టీ రిజర్వేషన్ జాబితా నుండి లంబాడా,కోయ,గోండు కులాలను తొలగించాలని ఏకలవ్య ఎరుకల సంఘం రాష్ట్ర నాయకుడు రాయపురం సాంబయ్య గట్టిగా డిమాండ్ చేశారు.ఇప్పటికే వందల ఎకరాల వ్యవసాయ భూములు కలిగి సౌఖ్యంగా జీవిస్తున్న ఈ కులాలకు రిజర్వేషన్ల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.సాంబయ్య మాట్లాడుతూ..ఎరుకల,యానాది,చెంచు వంటి నిజమైన గిరిజన ఉపకులాలు నేటికీ భూమిలేని స్థితిలో ఆర్థికంగా,రాజకీయంగా,సామాజికంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి.కానీ లంబాడా,కోయ,గోండు వంటి పైచేయి కులాలు తమ ఆర్థిక బలం ఆధారంగా రిజర్వేషన్ల ప్రయోజనాలను సొంతం చేసుకుంటూ అసలైన వెనుకబడిన గిరిజన వర్గాలను అణగదొక్కుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా రిజర్వేషన్ల అసలైన లక్ష్యం వెనుకబడిన వర్గాలను ముందుకు తేవడమేనని, కానీ ధనిక గిరిజన కులాలు వాటిని ఆక్రమించుకోవడం వల్ల గిరిజన సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయని విమర్శించారు.ఎస్టీ రిజర్వేషన్లలో అసలైన అర్హులైన భూమిలేని పేద గిరిజన ఉపకులాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.