మునిగాల మొగిలి పార్థివదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి నివాళి
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శలు చేశారు.ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య తండ్రి కీ.శే. మునిగాల మొగిలి ఇటీవల మరణించగా,వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు.మాజీ మంత్రి వెంట మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గడ్డం రఘువంశీ గౌడ్, మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, పట్టపురం ఎల్లగౌడ్, అడ్డగూడి సతీష్, కొత్తూరి రాజు, చింత అశోక్, కొత్తూరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.