కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అండగా ఉంటాం-డివైఎఫ్ఐ
పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పూర్తిగా అండదండగా ఉంటామని, సమ్మె విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్
స్థానిక నడిగూడెం మండలం మండల పరిషత్ భవనం ముందు గ్రామపంచాయతీ వర్కర్లు నిర్వహిక దీక్ష కోసం వేసిన టెంట్ లో 3వ రోజున సంఘాల డివైఎఫ్ఐ నాయకులు మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాసాని కిషోర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఆదివారానికి సెలవు దినం ప్రకటించాలని, పండగలకు ,జాతీయ పండుగలకు సెలవులు ఇవ్వాలని, 11వ పిఆర్సి ప్రకారం ప్రతి కార్మికులకు 25 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
చనిపోయిన ప్రతి కార్మికుడికి దహన సంస్కారాల కోసం 30 వేల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని , మల్టీపర్పస్ వర్కర్స్ విదానాన్ని రద్దు చేయాలని వారు అన్నారు.గ్రామపంచాయతీ వర్కర్స్ చేస్తున్న ఈ సమ్మెకు సంఘాలు మద్దతుగా ఉంటాయని అవసరమైతే ప్రత్యక్ష కార్యక్రమము పిలుపునిస్తామని వారి సందర్భంగా తెలియజేశారు.ఈ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు సభ్య సమాజం మద్దతు తెలియజేయాలని వారి సందర్భంగా కోరారు. ఈ కెసిఆర్ ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని మార్చుకోకపోతే గద్ద దింపే వరకు పోరాటాలు ఆగవని వారి సందర్భంగా డిమాండ్ చేశారు.
కార్మికులతో పెట్టుకున్న ఏ పార్టీలు మిగలలేదని జాగ్రత్తగా ఉండాలని వారి సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కేశగానీ భద్రయ్య, అంజి నాగేశ్వరరావు, గ్రామపంచాయతీ సిబ్బంది చిమట నాగరాజు,ఖమ్మంపాటి మధుసూదన్, శ్రీకాంత్, తిరపయ్య, గురవయ్య సక్కుబాయమ్మ,సురేష్,శ్రీను భాష,తదితరులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.