గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వారిని రోడ్డున పడేసి బిక్షాటన చేయిస్తుందని బెల్లంకొండ సత్యనారాయణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బిక్షాటన చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా బిక్షాటన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు కుటుంబాలను పస్తులు ఉంచుకుంటూ అరకొర జీతాలతో కుటుంబ పోషణ చేయలేక అనేక సంవత్సరాలు వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వం కనికరించడం లేదనిఅన్నారు. గ్రామపంచాయతీలో మురికి పనుల వల్ల అనేకమంది కార్మికులు అనారోగ్య పాలై ప్రాణాలర్పించిన అనేక సందర్భాలు ఉన్నాయ న్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాధాకృష్ణ, మల్లెల వెంకన్న మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరైనది కాదనన్నారు.తెలంగాణ సాధనలో కీలకమైన భూమిక పోషించిన గ్రామపంచాయతీ కార్మికులను ఆనాడు కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని ఉద్యోగులని కడుపులో పెట్టుకొని చూస్తానని మాటలు చెప్పినటువంటి ఈ పాలకులు వాళ్ల బాధలను చూసి వారి డిమాండ్ ను పరిష్కరించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు సీమట నాగరాజు, సుభాని, లచ్చయ్య,వెంకన్న , నాగభూషణం, మధుసూదన్, ఆంజనేయులు, వీరస్వామి, వెంకటమ్మ, ఉపేంద్ర, సక్కుబాయి గురవమ్మ కమలాకర్ భిక్షం, రాములు, నాగయ్య, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు….