దేవుళ్ళనే దోచే దొంగ దొరికాడు..!!

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన మామిడి గోపి ప్రస్తుతం ఖమ్మంలో ఉంటూ జల్సాలకు అలవాటుపడి దేవాలయాలలో దొంగతనం చేస్తు న్నాడు. ఈనెల 28వ తేదీన కురవి పెద్దచెరువు సమీపంలోని గంగమ్మ తల్లి ఆలయంలో చోరికి పాల్పడ్డాడు. జూన్ 16వ తేదీన కురవి మండలంలోని తాట్యాతండా హనుమంతుని ఆలయంలో, కురవి రామాలయంలో వరుస దొంగతనాలు .. హుండీ చోరి జరిగింది. ఇటీవల కురవి గంగమ్మ తల్లి ఆలయంలో కూడా అదే రీతిలో చోరీ జరగడం పోలీసులకు సవాలుగా మారింది. దీనిని సవాలుగా తీసుకున్న కురవి పోలీసులు ఎస్సై గోపి నేతృత్వంలో గంగమ్మతల్లి ఆలయం చోరీ జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని సొత్తు రికవరీ చేశారు. నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు ఎస్సై గోపి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై గోపి మాట్లాడుతూ గ్రామాలలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తారసపడితే పోలీసులకు సమాచారం అందించి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *