భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాచలం ITDA పిఓ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన DYFI ( భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య )జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు ,కాలంగి హరిక్రిష్ణ.
శనివారం ఐటీడీఏ పీవో ఛాంబర్ లో పి ఓ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ
భద్రచలం ఐటీడీఏ లో సమస్యల పరిష్కారంలో చాలా అద్భుతంగా po గారి కృషి ఉండబోతుందని , సమస్యల కోసం ఎవరు వచ్చిన నేరుగా కలవడం కోసం అవకాశం కల్పిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు, గిరిజన ప్రాంతంలో మారుమూల పల్లెటూర్లలో అందరికీ నాణ్యమైన విద్య , వైద్యం, ఉపాధి అవకాశాల పెంపుదాలలో ఐటీడీఏ కృషి పెరగాలని కోరారు . యూత్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా అనేక ఉపాధి అవకాశాలు కల్పించి యువతకు మార్గం మార్గ నిర్దేశం చేయాలని కోరారు.