పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట టౌన్ సమీపంలో నూతనంగా శ్రీ సాయి ఆదిత్య ఫిల్లింగ్ స్టేషన్ హిందుస్థాన్ పెట్రోలియం బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బంక్ యాజమాన్యం ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బంక్ యాజమాన్యం సాయి స్వరూప్ – సాహితీలను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, బంక్ యాజమాన్యం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.