విద్యాశాఖ ఆధ్వర్యంలో కుక్-కమ్-హెల్పర్స్ వంటల పోటీలు
జనగామ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ధర్మకంచ ప్రాంగణంలో కుక్-కమ్-హెల్పర్స్ వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు.జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కుక్-కమ్-హెల్పర్స్‌కు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు.జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కుక్-కమ్-హెల్పర్స్ ఉత్సాహంగా పాల్గొని,ఆహార భద్రత, పరిశుభ్రత,ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పోషక విలువలు గల రుచికరమైన వంటకాలను సిద్ధం చేశారు.ప్రతి మండలం నుంచి వచ్చిన సభ్యులు వివిధ కూరగాయలతో సృజనాత్మకమైన వంటకాలను అక్కడికక్కడే తయారు చేశారు.ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ధర్మకంచ విద్యార్థులు వండిన ఆహారాన్ని రుచి చూసి విజేతలను ఎంపిక చేయడం విశేషం.పోటీల ఫలితాల్లో
మొదటి స్థానం-లక్ష్మి
రెండవ స్థానం-సుజాత
మూడవ స్థానం-హాసియ
విజేతలుగా నిలిచారు.ఈ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన పథకం జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి శంకర్ రెడ్డి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ధర్మకంచ ప్రధానోపాధ్యాయుడు ఎం.కనకయ్య పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అదేవిధంగా ఇన్చార్జి ఉమాదేవి,నళిని (ఆపరేటర్),ప్రశాంత్ తదితర సిబ్బంది కార్యక్రమ విజయానికి విశేషంగా కృషి చేశారు.మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,పోషక విలువలతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.