సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడిగా గుండెబోయిన రాజు ఎన్నిక
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.శనివారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.గుండెబోయిన రాజు విద్యార్థి దశ నుంచే సిపిఎం పార్టీలో చురుకైన కార్యకర్తగా కొనసాగుతున్నారు.ప్రజానాట్య మండలి,డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ప్రజా కార్యక్రమాలను నిర్వహించారు.పార్టీ శాఖ కార్యదర్శి,గ్రామ కార్యదర్శి,మండల కమిటీ సభ్యుడు వంటి పదవుల్లో సేవలందించిన ఆయన ప్రస్తుతం మండల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మండల ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం,మండల సమగ్ర అభివృద్ధి దిశగా ఉద్యమాలు చేపడతామని రాజు తెలిపారు.పార్టీని ప్రతి గ్రామంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.జిల్లా కమిటీలో అవకాశం ఇచ్చినందుకు పార్టీ జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.