అంగన్వాడీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి-రాపర్తి రాజు
Jangaonకేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అంగన్వాడిలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు పేర్కొన్నారు
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె లో కలెక్టరేట్ ముందు 48 గంటల నిరసన వంటావార్పు నిరసన కార్యక్రమం విజయవంతంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నిర్వహించారు
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో సమ్మె విజయవంతంగా జరిగిందని రాపర్తి రాజు అన్నారు. శుక్రవారం రోజున సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు సాయంత్రం వరకు అంగన్వాడి కార్యకర్తలు బైఠాయించారు అనంతరం కలెక్టరేట్ నుండి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై రాపర్తి రాజు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 ఇవ్వాలని డిమాండ్ చేశారు . ఈఎస్ఐ పిఎఫ్ ,ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలి డిమాండ్ చేశారు. 2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హెల్పర్లకు రూ.750/-లు,మినీ వర్కర్లకు రూ.1,250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్తో సహా చెల్లించాలనీ అన్నారు. 2017 నుండి టిఎ,డిఎ బకాయిలు మొత్తం చెల్లించాలనీ,దీనికి సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలి.3 సం॥రాల రేషన్ షాపు ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలనీ,పిఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలవి వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు. అంగన్ వాడిలలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనీ,ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలనీ,మదర్స్ కమిటీలకు చైర్మన్ గా తల్లులను మత్రమే నియమించాలనీ గ్రామ సర్పంచులను చైర్మన్ నియమాకం చేసే పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేశారు.ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పై॥ల నుండి రూ.5/-లకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 పై॥ల నుండి రూ.10/-లకు పెంచాలనీ డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలనీ ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లంటినీ మెయిన్ సెంటర్లుగా గుర్తించి అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలనీ కోరారు.2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి.NHTS యాప్ ను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలనీ, అన్లైన్ పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ అంగన్వాడీలకు ఇవ్వాలనీ అన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ.250/- ల నుండి రూ.2,000/-లకు పెంచాలనీ రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలనీ డిమాండ్ చేశారు.ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలనీ,జివో. నెం 14, 19, 8 లను వేంటనే సవరించి అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధాకలు అమలు చేయాలని డిమండ్ చేశారు
అంగన్వాడి సమ్మెకు వివిధ ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు ప్రకటించాయని ప్రత్యక్షంగా పాల్గొని అంగన్వాడీలకు అండగా ఉంటామని తెలియజేసిన ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్ జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మచ్చ శారద తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దడిగ సందీప్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ నాయక్ సీఐటీయూ టౌన్ కమిటీ సభ్యులు గంగరబోయిన మల్లేష్ రాజ్ అంగన్వాడీ యూనియన్ జిల్లా మండల నాయకులు రాజకల సరిత జయమ్మ రాజేశ్వరి యాదమ్మ రజిత సుజాత రాజలక్ష్మి లక్ష్మణ్ బాయ్ స్వరూప శోభ కవిత పద్మ ఉమా రాజ పూల రజిని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.