అధిక రక్తపోటు వల్ల ఎన్నో అనర్ధాలు
Suryapet: జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడిన బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతినెల స్థానిక ఆరోగ్య కార్యకర్త వద్ద లేదా పల్లె దావఖానా వైద్యాధికారి వద్ద, దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తరచుగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అదుపులో లేని మధుమేహం మరియు అధిక రక్తపోటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని , దీనివల్ల శరీరంలో ఇతర భాగాలకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. బిపి నియంత్రణలో ఉంచుకోవడం కొరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ,జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాలని, ప్రతిరోజు తీసుకునే ఉప్పుని తగ్గించాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవితం కొరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆసుపత్రి రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవళి , కవిత, స్టాఫ్ నర్స్ లు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.