జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని ఉప్పుగల్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1000 గల భూమిలో అక్రమంగా,దొంగతనంగా మొరం తరలిస్తున్న ఒక జెసిబి,3టిప్పర్లను జఫర్ఘడ్ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై బి.మాధవ్ గౌడ్ మాట్లాడుతూ..సోమవారం ఉదయం సుమారు ఒంటి గంట సమయంలో జఫర్ఘడ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దొంగతనంగా మొరం తరలిస్తున్న ఒక జెసిబి,3టిప్పర్లను కనపడ్డాయి.వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మొరం అక్రమంగా తరలిస్తే వాహనాలు సీజ్ చేసి,కేసులు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.